26July-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

మధ్యప్రదేశ్‌లోని పన్నాలో గుంతలు తవ్వి ఇసుకను జల్లెడ పట్టే ఓ రోజు కూలీ రాజు గోండ్ కు అదృష్టం వరించింది. దశాబ్ద కాలంగా అతడు వజ్రాల కోసం వెతుకుతూనే ఉన్నాడు.. అతడికి ఎట్టకేలకు అనుకున్నది దొరికింది. తన చేతుల్లోకి మెరుస్తున్న వస్తువును తీసుకోగలిగాడు. ఇది 19.22 క్యారెట్ల వజ్రం, ప్రభుత్వ వేలంలో దాదాపు రూ.

Update: 2024-07-26 12:12 GMT

Diamond Found: డైలీ లేబర్ ని వరించిన అదృష్టం.. 80 లక్షల వజ్రం దొరకడంతో!

మధ్యప్రదేశ్‌లోని పన్నాలో గుంతలు తవ్వి ఇసుకను జల్లెడ పట్టే ఓ రోజు కూలీ రాజు గోండ్ కు అదృష్టం వరించింది. దశాబ్ద కాలంగా అతడు వజ్రాల కోసం వెతుకుతూనే ఉన్నాడు.. అతడికి ఎట్టకేలకు అనుకున్నది దొరికింది. తన చేతుల్లోకి మెరుస్తున్న వస్తువును తీసుకోగలిగాడు. ఇది 19.22 క్యారెట్ల వజ్రం, ప్రభుత్వ వేలంలో దాదాపు రూ.

Rahul Dravid Son: వేలంపాటలో అమ్ముడు పోయిన రాహుల్ ద్రావిడ్ కుమారుడు

భారత క్రికెట్ జట్టు మాజీ ప్రధాన కోచ్, కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్‌ను కర్ణాటక ప్రీమియర్ లీగ్ లో మైసూరు వారియర్స్ జట్టు కొనుగోలు చేసింది. సమిత్ ను మహారాజా ట్రోఫీ KSCA T20 సీజన్‌కు ముందు ఆటగాళ్ల వేలం సందర్భంగా తీసుకున్నారు.

India Women vs Bangladesh Women ఆసియా కప్ ఫైనల్ లో అడుగుపెట్టిన భారత్

భారత మహిళల జట్టు ఆసియా కప్ ఫైనల్ లో అడుగుపెట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 80 పరుగులు చేసింది. ఛేజింగ్ లో భారత జట్టు ఏ మాత్రం తడబడలేదు. ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 11 ఓవర్లలో లక్ష్యానికి చేరుకుని ఆసియా కప్ ఫైనల్ లో అడుగుపెట్టింది.

Minority Welfare budgetary: మైనారిటీలకు భారీగా కేటాయింపులు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం గురువారం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మైనారిటీ సంక్షేమ శాఖకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా రూ.3002 కోట్లు కేటాయించింది.

Dhanush Raayan Review: రాయన్ సినిమా రివ్యూ

తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న తమిళ నటులలో ధనుష్ ఒకరు. రఘువరన్ బీటెక్ సినిమా నుండి ధనుష్ కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ మొదలైంది. ఇక సార్ సినిమా భారీగా కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇక అతడు హీరోగా నటించిన 'రాయన్' సినిమా థియేటర్లలో విడుదలైంది.

Hyderabad twin blasts: జైల్లోనే చనిపోయిన సయ్యద్ మక్బూల్

హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో దోషి అయిన సయ్యద్ మక్బూల్ అలియాస్ జుబేర్ చర్లపల్లి సెంట్రల్ జైలులో చికిత్స పొందుతూ మరణించాడు. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ కీలక సభ్యుడు, 2013 దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుడుతో సహా పలు కేసుల్లో దోషిగా తేలి శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు జుబేర్.

Nalgonda: అస్సాంలో మరణించిన నల్గొండకు చెందిన ఆర్మీ జవాన్

నల్గొండ జిల్లాలోని మాదారిగూడెంకు చెందిన భారత ఆర్మీ జవాన్ మహేశ్ అనారోగ్యంతో మృతి చెందాడు. 24 ఏళ్ల వయసున్న మహేష్ ఏడాది కాలంగా అస్సాంలో పనిచేస్తున్నాడు. మహేశ్ మృతి చెందిన సమాచారాన్ని ఇండియన్ ఆర్మీ అధికారులు తల్లిదండ్రులకు తెలియజేయడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Road Accident: శామీర్ పేటలో ఘోర రోడ్డు ప్రమాదం

శామీర్ పేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురి ప్రాణాలు పోయాయి. ఓ కారు బీభత్సం సృష్టించిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసి బస్సును తప్పించబోయి బోల్తా పడింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Chevella: చేవేళ్ల పోలీసుల వీడియో వైరల్.. ఇలా కొట్టారేంటి!!

తెలంగాణలోని చేవెళ్ల వద్ద బహిరంగంగా ఇద్దరు వ్యక్తులపై ట్రాఫిక్ పోలీసు అధికారి, కానిస్టేబుల్ దాడి చేసిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఓ వ్యక్తిని కానిస్టేబుల్ లాక్కుని వస్తూ ఉండగా.. అధికారి వెనుక నుండి తన్నడం ఈ వీడియోలో చూడొచ్చు.

Drain Fly: మన ముందు ఉండే ఈగనే.. కంటి చూపు పోడానికి కారణమైంది

చైనాలో ఒక వ్యక్తి తన ముఖంపై వాలిన ఈగను చంపడం వల్ల ఏకంగా కంటినే కోల్పోయాడు. అతడికి ఇన్ఫెక్షన్ సోకడంతో అతని ఎడమ కనుగుడ్డును తొలగించాల్సి వచ్చింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) ప్రకారం.. వు అనే వ్యక్తి తనను ఇబ్బంది పెడుతున్న ఈగ తన ముఖంపై వాలిన తర్వాత దానిని చంపాడు.


Tags:    

Similar News