టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
Layoffs:పలు దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను సాగనంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. IBM సంస్థ కూడా అదే బాటలో పయనించడానికి సిద్ధమైంది. మరో రౌండ్ గ్లోబల్ గా ఉద్యోగాల కోతలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. స్వచ్ఛందంగా ఉద్యోగులు వెళ్లిపోవాలనుకుంటే తమకు చెప్పొచ్చని..
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Layoffs: ఉద్యోగులకు ఊహించని షాకిచ్చిన ఐబీఎం
Layoffs:పలు దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను సాగనంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. IBM సంస్థ కూడా అదే బాటలో పయనించడానికి సిద్ధమైంది. మరో రౌండ్ గ్లోబల్ గా ఉద్యోగాల కోతలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. స్వచ్ఛందంగా ఉద్యోగులు వెళ్లిపోవాలనుకుంటే తమకు చెప్పొచ్చని..
క్రికెట్ అభిమానులకు మరో సూపర్ న్యూస్
క్రికెట్ అభిమానులకు మరో శుభవార్త. Disney+ Hotstar మొబైల్ యాప్‌లో ICC 2024 పురుషుల T20 ప్రపంచ కప్ గేమ్‌లను ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ మ్యాచ్ లను ఎటువంటి సబ్ స్క్రిప్షన్ లేకుండా మొబైల్ ఫోన్స్ లో చూసుకోవచ్చు. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ఐసీసీ ఈవెంట్ జూన్ 1 నుండి జూన్ 29 వరకు జరగనుంది.
NBK109 : బాలయ్య మూవీలో దుల్కర్.. హింట్ ఇచ్చిన హీరోయిన్..
NBK109 : నందమూరి బాలకృష్ణ తన 109వ చిత్రాన్ని దర్శకుడు బాబీతో చేస్తున్న సంగతి తెలిసిందే. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆల్రెడీ చిత్రీకరణ మొదలుపెట్టుకొని ఓ షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది. ఊటీలో బాలయ్యతో హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించారు.
Social Media Influencers:ప్రజలు మోసపోడానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా కారణమేనా?
ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనూ మొబైల్ ఫోన్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను తెగ వాడేస్తూ ఉన్నారు. అలా చూస్తూ.. చూస్తూనే నిమిషాలు.. గంటలు గడిచిపోతూ ఉన్నాయి. ఇక వీధికి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చారు. అయితే వీళ్లకు కాస్త డబ్బులను ఆశ చూపించి కొన్ని ఫేక్ వెబ్ సైట్స్ ప్రమోషన్స్ చేయించుకుంటూ ఉన్నాయి.
Narendra Modi:ముగిసిన ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన.. రేవంత్ రెడ్డి ఏమి కోరారంటే?
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ముగిసింది. రెండు రోజుల పాటు ఆయన తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్, సంగారెడ్డి బీజేపీ విజయ సంకల్ప సభలలో పాల్గొని క్యాడర్ ను ఉత్సాహపరిచారు. గత రాత్రి హైదరాబాద్ చేరుకున్న ప్రధాని రాజ్ భవన్‌లో బస చేశారు.
విశాఖలో సీఎం జగన్ మాటల్లో కాన్ఫిడెన్స్ చూశారా?
విశాఖపట్నంలో 'విజన్ విశాఖ' సదస్సులో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. వైజాగ్ నగరంలోని వనరులను పారిశ్రామికవేత్తలకు వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ను కోల్పోయామనీ.. దాని ప్రభావం ఇప్పటికీ మన రాష్ట్రంపై కొనసాగుతుందని అన్నారు. ప్రస్తుతం విశాఖ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని..
Ram Charan : షారుక్ అవమానించలేదు.. రజినీతో చరణ్‌ని పోల్చాడు..
ఇటీవల అంబానీ ఇంట జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి బాలీవుడ్ స్టార్స్ తో పాటు సౌత్ స్టార్స్ కూడా అటెండ్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఆ సెలబ్రేషన్స్ కి టాలీవుడ్ నుంచి మెగా కపుల్ రామ్ చరణ్ ఉపాసన హాజరయ్యారు. ఇక ఆ ఈవెంట్ లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్‌తో కలిసి రామ్ చరణ్ నాటు నాటు స్టెప్ వేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్న విషయం కూడా తెలిసిందే.
ముల్లంగితో ఎలాంటివి తినకూడదో తెలుసా? తింటే ప్రమాదమే!
Radish:క్యాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఫాస్పరస్, విటమిన్ సి వంటి పోషకాలు ముల్లంగిలో ఉంటాయి. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు పొట్టను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ముల్లంగితో ఏమి తినకూడదో తెలుసుకుందాం.
JP Nadda:రాజీనామా చేసిన జేపీ నడ్డా.. ఎందుకో తెలుసా?
JP Nadda:భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సోమవారం నాడు ఆయన హిమాచల్ ప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత.. నడ్డా తన హిమాచల్ ప్రదేశ్ స్థానానికి రాజీనామా చేసినట్లు అధికారులు తెలిపారు.
డిజిటల్ చెల్లింపుల్లో భారత్ టాప్: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
India Top in Digital Payments:గత 12 సంవత్సరాలలో భారత్‌లో డిజిటల్ లావాదేవీలు 90 రెట్లు పెరిగాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా సాగే మొత్తం ఆన్‌లైన్ పేమెంట్స్‌లో 49 శాతం మన భారతదేశంలోని జరుగుతున్నాయని అన్నారు. సోమవారం ముంబైలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన డిజిటల్ చెల్లింపుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.