టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
U.S. Consulate Jobs : పర్మినెంట్ ఉద్యోగం.. లక్షల జీతం.. వారానికి నలభై గంటల పని,Ys Jagan : మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే... చంద్రబాబుది అంతా మోసం, KCR : టచ్ చేసి చూడు అప్పుడు చెబుతా
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Ys Jagan : మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే... చంద్రబాబుది అంతా మోసం
తిరిగి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది మన ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మళ్లీ బడ్జెట్ ను కూడా మనమే ప్రవేశపెడతామని తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు ఎవరూ చంద్రబాబును నమ్మడం లేదన్నారు.
KCR : టచ్ చేసి చూడు అప్పుడు చెబుతా
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని వత్తిడులు తెచ్చినా పదేళ్లలో తాము ఏనాడు తెలంగాణ ప్రాజెక్టులను ఏనాడు అప్పగించలేదని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల నేతలతో సమావేశమై కృష్ణా నదీ జలాల అంశానికి సంబంధించి చర్చించారు.
Summer : ఫిబ్రవరి మొదటి వారంలోనే టీజర్ రిలీజ్ చేసిన సూరీడు... అసలు సినిమా ముందుంది
హైదరాబాద్ లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం పది గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఫిబ్రవరి మొదట ివారంలోనే ఎండల తీవ్రత, ఉక్కబోత మొదలు కావడం ఇదే మొదటి సారి అని చెబుతున్నారు. సాధారణంగా ఫిబ్రవరి చివరి వారంలో ఎండలు కొంత మొదలవుతాయి
Uniform Civil Code : ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌరస్మృతి బిల్లు అమలులో అందరికంటే ముందుంటుందా?
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మంగళవారం ఉదయం ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి పుష్కర్ ధామి ఈబిల్లును ప్రవేశపెట్టడం విశేషం. అసెంబ్లీ ముందుకు వచ్చిన ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే ఈ బిల్లు ఆమోదం పొందితే మాత్రం దేశంలో తొలిసారి ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశ పెట్టిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలుస్తుందని చెప్పక తప్పదు.
Big Breaking : మధ్యప్రదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం.. ఐదు గురు మృతి
మధ్యప్రదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో నలభై మంది గాయాలపాలయ్యారు. మధ్యప్రదేశ్ లోని హర్థా పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది. హర్ధాలోని ఒక బాణసంచా ఫ్యాక్టరీలో పెద్దయెత్తున మంటలు చెలరేగాయి.
U.S. Consulate Jobs : పర్మినెంట్ ఉద్యోగం.. లక్షల జీతం.. వారానికి నలభై గంటల పని
తాపీ మేస్త్రీ ఉద్యోగమంటే.. నెలకు పది నుంచి పదిహేను వేల రూపాయలు ఉంటుంది. రోజువారీగా కూడా కూలీ ఇస్తారు. రోజు వారీ కూలీ ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయల వరకూ ఇస్తారు. కానీ యూఎస్ కాన్సులేట్ లో తాపీమేస్త్రీ ఉద్యోగానికి భారీ వేతనంతో నోటిఫికేషన్ విడుదలయింది.
కానిస్టేబుల్ ను చంపేసిన ఎర్రచందనం స్మగ్లర్లు
అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు దారుణానికి ఒడిగట్టారు. కానిస్టేబుల్ ను వాహనాన్ని కొట్టి మరీ చంపేశారు. సోమవారం రాత్రి తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కేవీపల్లి మండలం చీనెపల్లె వద్ద ఎర్రచందనం అక్రమ రవాణా అవుతున్నట్లు టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి సమాచారం రావడంతో సరిహద్దు గొల్లపల్లి చెరువు వద్ద ఉన్నారు.
దారుణంగా పడిపోయిన మిర్చి ధరలు
గుంటూరు మిర్చి యార్డులో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిర్చి ధర దారుణంగా పడిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. కడప, కర్నూలు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు గుంటూరు మిర్చి యార్డులో రైతులు పడిగాపులు కాస్తున్నారు. వ్యాపారులు, కోల్డ్ స్టోరేజ్ యజమానులు కుమ్మక్కై ధరలు దారుణంగా తగ్గించారంటూ ఆందోళనకు దిగారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు లుక్ అవుట్ నోటీసులు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ప్రగతి భవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన తన కుమారుడిని తప్పించారని షకీల్‌పై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. రహేల్ దుబాయ్ పారిపోవడానికి షకీల్ సహకరించారని పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు.
https://www.telugupost.com/telangana/telangana-ex-chief-minister-kcr-revanth-reddy-was-severely-criticized-1519212