ఢిల్లీ బాట పట్టారు
తెలుగుదేశం పార్టీ నేతలు ఢిల్లీ బాట పట్టారు. ప్రధానంగా శాసనమండలి రద్దు అంశంపై టీడీపీ ఎమ్మెల్సీలు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలసి వివరించాలని నిర్ణయించారు. కేవలం రాజకీయ [more]
తెలుగుదేశం పార్టీ నేతలు ఢిల్లీ బాట పట్టారు. ప్రధానంగా శాసనమండలి రద్దు అంశంపై టీడీపీ ఎమ్మెల్సీలు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలసి వివరించాలని నిర్ణయించారు. కేవలం రాజకీయ [more]
తెలుగుదేశం పార్టీ నేతలు ఢిల్లీ బాట పట్టారు. ప్రధానంగా శాసనమండలి రద్దు అంశంపై టీడీపీ ఎమ్మెల్సీలు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలసి వివరించాలని నిర్ణయించారు. కేవలం రాజకీయ కక్ష కారణంగానే శాసనమండలిని ఏకపక్షంగా రద్దు చేశారని వారికి తెలియజేయనున్నారు. ఇప్పటికే రేపు సాయంత్రం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అపాయింట్ మెంట్ ఎమ్మెల్సీలకు లభించింది. ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, హోంమంత్రి అమిత్ షాలను కూడా కలిసి తమ సమస్యలను చెప్పుకునేందుకు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. మూడు రాజధానుల అంశాన్ని కూడా కేంద్రం పెద్దల దృష్టికి తీసుకెళ్లనున్నారు. రాజధాని రైతులపై పోలీసులు అమానుషంగా వ్యవహరించిన తీరును కూడా ఫొటోల రూపంలో అగ్రనేతలకు ఇవ్వనున్నారు.