మహాకూటమి మీటింగ్... ఎల్.రమణ గైర్హాజరు

Update: 2018-11-05 13:41 GMT

మహాకూటమి సీట్ల సర్దుబాటు తుదిదశకు చేరుకుంది. ఇవాళ సాయత్రం హైదరాబాద్ లోని ఓ హోటల్ లో మహాకూటమి సమావేశం జరిగింది. అయితే, ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలతో పాటు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాత్రమే హాజరయ్యారు. ఇక టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సమావేశానికి గైర్హాజరయ్యారు. అయితే, తమకు కావాల్సిన సీట్ల గురించి ఇప్పటికే స్పష్టత ఇచ్చామని, అందుకే కూటమి సమావేశానికి వెళ్లలేదని రమణ చెబుతున్నారు. మరోవైపు సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డికి ఈ సమావేశానికి ఆహ్వానం పంపలేదు. ఇప్పటికే సీపీఐ రెండు రోజుల సీట్ల కేటాయింపుపై స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ కు అల్టిమేటం జారీ చేసింది. దీంతో కాంగ్రెస్ తర్జన భర్జనలో పడింది. సీపీఐకి కనీసం 5 స్థానాలు కావాలని డిమాండ్ చేస్తోంది. కోదండరాం 14 స్థానాలు కావాలంటున్నారు. అయితే, సీపీఐకి 3, టీజేఎస్ కి 8 స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి నేటి సమావేశంలో సీట్ల సర్దుబాటును ఒక కొలిక్కి తెచ్చే అవకాశం కనిపిస్తోంది.

Similar News