కూటమిలో ఆరని మంటలు ...!!

Update: 2018-11-12 03:30 GMT

మహాకూటమిలో ఇంకా మంటలు కొనసాగుతూనే వున్నాయి. కాంగ్రెస్ స్థానాలు కొన్ని పొత్తుల్లో పోగొట్టుకుంటున్నవారు గాంధీభవన్ మొదలు కొని జిల్లా కాంగ్రెస్ కార్యాలయాలవరకు తమ అనుచర గణంతో ఆందోళన కొనసాగిస్తున్నారు. తమ సీట్లను ఇతర పార్టీలకు ఇస్తే సత్తా చూపిస్తామని నేరుగా ఏఐసిసి కె అల్టిమేటం లు ఇచ్చేస్తున్నారు. మరోపక్క సిపిఐ - కాంగ్రెస్ పొత్తు కుస్తీ ఇంకా తేలలేదు. తాము 9 నుంచి ఐదుకు దిగివస్తే కాంగ్రెస్ మాత్రం తొలినుంచి 3 స్థానాలంటూ తమపార్టీపై చిన్నచూపు చూస్తుందంటూ ఆ పార్టీ మండిపడుతుంది.

నేటి సాయంత్రం డెడ్ లైన్ ...

ఓపిక నశించిన సిపిఐ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఫైనల్ వార్నింగ్ కాంగ్రెస్ కు ఇచ్చేశారు. సీట్ల సర్దుబాటులో కోరుకున్న ఐదుస్థానాలు ఇవ్వని పక్షంలో కూటమికి గుడ్ బై కొట్టి నేరుగా అన్ని స్థానాల్లో పోటీకి దిగుతామని వెంకట రెడ్డి స్పష్టం చేశారు. నలభై స్థానాల్లో గెలుపు ఓటములను తమపార్టీ నిర్ణయిస్తుందని 9 స్థానాల్లో బలమైన ఓటు బ్యాంక్ ఉందని చాడా ప్రకటించారు.

నామినేషన్ల ప్రక్రియ.......

కాంగ్రెస్ దూతలుగా వచ్చినవారు తమను తగ్గాలంటున్నారు తప్ప కాంగ్రెస్ ను సీట్లు పెంచమని ఎందుకు కోరడం లేదని వారి చర్చలు విఫలం అయినట్లు తేల్చేశారు. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ తో పాటు నామినేషన్ల ప్రక్రియ సోమవారంనుంచి మొదలు కానున్న నేపథ్యంలో ఇక ఉపేక్షించేది లేదంటున్నారు చాడ. దాంతో కూటమి పొత్తు వ్యవహారం రసకందాయంలో పడింది.

Similar News