గత రెండేళ్లుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో వ్యక్తిగతంగా క్షోభ అనుభవిస్తున్నానని, తప్పనిసరి పరిస్థితుల్లోనే పార్టీని వీడుతున్నానని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఆయన మూడు పేజీల రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కి పంపించారు. ఇందులో తన రాజీనామాకు ఐదు కారణాలను చూపారు. తెలంగాణ కోసం పోరాడిన కార్యకర్తలకు అన్యాయం జరగడం, తన నియోజకవర్గానికి న్యాయం చేసుకోలేకపోవడం, వ్యక్తిగతంగా తీవ్ర అసంతృప్తి, ప్రభుత్వంపై, పార్టీపై ప్రజల్లో అసంతృప్తితో తాను పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు.
ఉద్యమకారులను విస్మరించి......
టీఆర్ఎస్ ఉద్యమకారులను విస్మరించిందన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిలకు మంత్రి పదవులు ఇచ్చారని ఆరోపించారు. ఆయన రేపు మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. పార్లమెంటు సభ్యత్వానికి కూడా రాజీనామా చేసే యోచనలో యన ఉన్నట్లు తెలుస్తోంది.