నేడు బెజవాడ కోర్టుకు ముద్రగడ

కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం నేడు కోర్టుకు హాజరుకానున్నారు. తుని రైలు దగ్దం కేసులో ఆయన నిందితులుగా ఉన్నారు. 2016 జనవరిల తో [more]

Update: 2021-03-02 03:05 GMT

కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం నేడు కోర్టుకు హాజరుకానున్నారు. తుని రైలు దగ్దం కేసులో ఆయన నిందితులుగా ఉన్నారు. 2016 జనవరిల తో తూర్పు గోదావరి జిల్లా తునిలో ఆందోళనకారులు రైలును దగ్దం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముద్రగడ పద్మనాభంతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తుని కేసులను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించినా, రైల్వే శాఖ మాత్రం కేసును కొనసాగిస్తుంది. దీంతో ముద్రగడ పద్మనాభం ఈరోజు విజయవాడలోని రైల్వే కోర్టుకు హాజరుకానున్నారు.

Tags:    

Similar News