భారతీయ జనతా పార్టీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముస్లింలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఒకేసారి ముస్లింలకు మూడు పదవులు కేటాయించారు. ప్రస్తుతం మండలి ఛైర్మన్ గా ఉన్న ఎన్ఎండీ ఫరూక్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అలాగే ఎమ్మెల్సీ షరీఫ్ ను మండలి ఛైర్మన్ గా చేయాలని నిర్ణయించారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన చాంద్ భాషాకు ప్రభుత్వ విప్ పదవిని ఇవ్వాలని నిర్ణయించారు. కిడారి సర్వేశ్వరరావు మృతితో ఖాళీ అయిన విప్ పదవిని చాంద్ భాషాకు ఇవ్వనున్నారు.
కర్నూలుకు మూడు.....
ఇక ఫరూక్ ను మంత్రి వర్గంలోకి తీసుకోవడంతో కర్నూలు జిల్లాకు మూడు మంత్రి పదవులు దక్కినట్లయింది. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి గా కేఈ కృష్ణమూర్తి, మంత్రిగా అఖిలప్రియ మంత్రివర్గంలో ఉన్నారు. ఫరూక్ ను తీసుకోవడంతో కర్నూలు జిల్లాకు మూడు మంత్రి పదవులు దక్కినట్లయింది. అనంతపురం జిల్లాకు మరో విప్ పదవి దొరికింది. ఇప్పటికే పల్లె రఘునాధరెడ్డి చీఫ్ విప్ గా ఉన్నారు. మొత్తం మీద చంద్రబాబు ముస్లిం మైనారిటీలకు ఎన్నికల ముందర అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.