టీడీపీ తిరగబడితే….?

తెలుగుదేశం పార్టీ తిరగబడితే వైసీపీ నేతలు గ్రామాల్లో కూడా ఉండలేరని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఆయన ఈరోజు టీడీపీ [more]

Update: 2019-07-09 06:40 GMT

తెలుగుదేశం పార్టీ తిరగబడితే వైసీపీ నేతలు గ్రామాల్లో కూడా ఉండలేరని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఆయన ఈరోజు టీడీపీ నిర్వహించిన గోదావరి హారతిలో పాల్గొన్నారు. వైసీపీ టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడితే సహిచమని నారా లోకేష్ చెప్పారు. వైఎస్ జగన్ 45 రోజుల్లోనే అనేక యూటర్న్ లు తీసకున్నారని చెప్పారు. అమ్మఒడి కార్యక్రమం అమలుపై మంత్రులకే అవగాహన లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక నిర్మాణపు పనులన్నీ ఆగిపోయాయని నారా లోకేష్ చెప్పారు. అమరావతి నిర్మాణంపై జగన్ మాట్లాడకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని చెప్పారు. విత్తనాలు ఇవ్వకుండా రైతు దినోత్సవం చేశారని సెటైర్ వేశారు.

Tags:    

Similar News