జగన్ మేనమామ కాదు మెంటల్ మామ
పంతానికి పోయి విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టవద్దని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. లోకేష్ విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశాన్ని నిర్వహించారు. పరీక్షలు పెడతామంటే [more]
పంతానికి పోయి విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టవద్దని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. లోకేష్ విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశాన్ని నిర్వహించారు. పరీక్షలు పెడతామంటే [more]
పంతానికి పోయి విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టవద్దని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. లోకేష్ విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశాన్ని నిర్వహించారు. పరీక్షలు పెడతామంటే తాము చూస్తూ ఊరుకోబోమని లోకేష్ హెచ్చరించారు. ఎన్నికలకు ముందు విద్యార్థులకు మేనమామగా ఉంటానని చెప్పిన జగన్ ఇప్పుడు వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. మెంటల్ మామగా తయారయ్యారన్నారు. జాతీయ స్థాయిలో అన్ని పరీక్షలు రద్దు చేసిన విషయాన్ని లోకేష్ గుర్తు చేశారు. పరీక్షలు పెట్టి విద్యా సంవత్సరాన్ని కూడా జగన్ ప్రభుత్వం నాశనం చేస్తుందని లోకేష్ అన్నారు. నీతి ఆయోగ్ విద్యారంగంలో ప్రకటించిన స్థానాల్లో జాతీయ స్థాయిలో 19వ ర్యాంకు ఏపీకి వచ్చిందని లోకేష్ తెలిపారు. విద్యార్థుల జోలికి వస్తే ఊరుకోబోమని లోకేష్ హెచ్చరించారు.