పోలీసులపై లోకేష్ సంచలన కామెంట్స్

ఏపీ పోలీసులపై తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులపై ఆయన ఫైర్ అయ్యారు. పోలీసులను జగన్ రెడ్డి తన ఫ్యాక్షన్ [more]

;

Update: 2021-09-11 07:14 GMT

ఏపీ పోలీసులపై తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులపై ఆయన ఫైర్ అయ్యారు. పోలీసులను జగన్ రెడ్డి తన ఫ్యాక్షన్ సైన్యంగా మార్చుకున్నారని లోకేష్ అన్నారు. వైసీపీ నేతల కన్ను పడితే కబ్జా, ఆశపడితే ఆక్రమణ అన్నట్లుగా తయారయిందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అనేక సంఘటలను ప్రభుత్వం పట్టించుకోక పోగా, ప్రశ్నిస్తున్న వారిని పోలీసుల చేత అడ్డగిస్తున్నారన్నారు. అనేక చోట్ల పోలీసుల సాయంతో వైసీపీ నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారని నారా లోకేష్ ఫైర్ అయ్యారు. వైసీపీ నేతల ఆగడాలకు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News