నన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశముంది

తమ పార్టీ నేతలపై దాడులు చేస్తుంటే ఊరుకోబోమని నారా లోకేష్ హెచ్చరించారు. జగన్ లా తమ పార్టీ నేతలు దేశాన్ని దోచుకోలేదని అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి [more]

Update: 2020-06-15 06:42 GMT

తమ పార్టీ నేతలపై దాడులు చేస్తుంటే ఊరుకోబోమని నారా లోకేష్ హెచ్చరించారు. జగన్ లా తమ పార్టీ నేతలు దేశాన్ని దోచుకోలేదని అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేష్ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని తెలిపారు. జేసీ బ్రదర్స్ కు ట్రావెల్స్ వ్యాపారం కొత్త కాదన్నారు. వాహనాల కొనుగోళ్లలో ఎటువంటి అక్రమాలు చేయకపోయినా తప్పుడు కేసులు పెడుతున్నారని తెలిపారు. ఫైబర్ నెట్ కేసులో తనను కూడా అరెస్ట్ చేస్తామని అంటున్నారని చెప్పారు. వాహనాలను అమ్మిన డీలర్లపై ఎందుకు కేసులు పెట్టలేదన్నారు. అధికారంలోకి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తామని నారా లోకేష్ హెచ్చరించారు.

Tags:    

Similar News