బ్రేకింగ్ : అర్ధరాత్రి నుంచి దేశమంతా మూడు వారాలు లాక్ డౌన్
జనతా కర్ఫ్యూను దేశ ప్రజలు విజయవంతం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. చాలా బాధ్యతాయుతంగా వ్వవహరించారని తెలిపారు. మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. పరీక్షా సమయంలో చాలా [more]
జనతా కర్ఫ్యూను దేశ ప్రజలు విజయవంతం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. చాలా బాధ్యతాయుతంగా వ్వవహరించారని తెలిపారు. మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. పరీక్షా సమయంలో చాలా [more]
జనతా కర్ఫ్యూను దేశ ప్రజలు విజయవంతం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. చాలా బాధ్యతాయుతంగా వ్వవహరించారని తెలిపారు. మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. పరీక్షా సమయంలో చాలా చక్కగా వ్యవహరించారని మోదీ కితాబిచ్చారు. కరోనా వైరస్ ప్రబలకుండా ఉండాలంటే ప్రజల సహకారం అవసరమన్నారు. రెండు రోజుల నుంచి దేశంలోని అనేక రాష్ట్రాల్లో లాక్ డౌన్ లు ప్రకటించాయని, ఈరోజు అర్థరాత్రి నుంచి దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ప్రజలను ఈ మహమ్మారి నుంచి రక్షించుకోవడం కోసమే లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నామన్నారు.
ప్రజలు సహకరించాలి…..
ఒకరకంగా దేశ వ్యాప్తంగా కర్ఫ్యూను విధిస్తున్నట్లు మోదీ చెప్పారు. కరోనాతో యుద్ధం చేయాలంటే కఠిన నిర్ణయం తీసుకోక తప్పదని చెప్పారు. చేతులు జోడించి ప్రార్థిస్తున్నానని, ఇటువంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మూడు వారాల పాటు లాక్ డౌన్ ను దేశ వ్యాప్తంగా విధిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. ప్రతి ఇంటిముందు లక్ష్మణ రేఖ గీసుకోవాలని, దానిని దాాటకుండా ఎవరికి వారే ప్రతిన చేసుకోవాలన్నారు. ఈ 21 రోజులు చాలా కీలకమని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి ఇదే మార్గమని మోదీ తెలిపారు. ఏప్రిల్ 14వ తేదీ వరకూ లాక్ డౌన్ కొనసాగుతుందని చెప్పారు. ప్రజలు ప్రభుత్వ సూచనలను వందశాతం పాటిస్తేనే కరోనాను దేశం నుంచి తరిమికొట్టగలమన్నారు. సామాజిక దూరం పాటించాలన్నారు. ప్రజలు నిబంధనలు ఉల్లఘించరాదన్నారు.