మూడు గంటల పాటు మోదీ

అయోధ్య రామమందిరం నిర్మాణం భూమి పూజలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. మోదీ ఈరోజు ఉదయం 9.30గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి లక్నో వెళతారు. [more]

Update: 2020-08-05 03:22 GMT

అయోధ్య రామమందిరం నిర్మాణం భూమి పూజలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. మోదీ ఈరోజు ఉదయం 9.30గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి లక్నో వెళతారు. లక్నో నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మోదీ అయోధ్యకు చేరుకుంటారు. ఉదయం 11.40 గంటలకు హనుమాన్ గడి ఆలయంలో మోదీ పూజలు జరుపుతారు. అక్కడి నుంచి 12 గంటలకు రామజన్మభూమి ప్రాంతానికి చేరుకుంగారు. భూమి పూజ అనంతరం మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. దాదాపు మూడు గంటల పాటు మోదీ అయోధ్యలోనే ఉండటంతో పెద్దయెత్తున పోలీసు బలగాలు మొహరించాయి. పాక్ తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందని ఇంటలిజెన్స్ హెచ్చరికలతో పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమయింది.

Tags:    

Similar News