ప్రమాదం లేదనుకోవద్దు… అప్రమత్తంగా ఉండండి
కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత్ లో రికవరీ రేటు బాగుందని చెప్పారు. అమెరికా, బ్రెజిల్ తో [more]
కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత్ లో రికవరీ రేటు బాగుందని చెప్పారు. అమెరికా, బ్రెజిల్ తో [more]
కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత్ లో రికవరీ రేటు బాగుందని చెప్పారు. అమెరికా, బ్రెజిల్ తో పోలిస్తే కరోనా విషయంలో భారత్ పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పారు. కరోనా మరణాల రేటు కూడా ఇతర దేశాలతో పోలిస్తే తక్కువగా ఉందన్నారు. కరోనా తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని చెప్పారు. కరోనా సమయంలో సేవ చేస్తున్న వారందరికీ మోదీ ధన్యవాదాలు చెప్పారు. కరోనా ముప్పు ఇంకా తొలిగిపోలేదని, మరికొన్ని రోజులు పోరాడాల్సిందేనని తెలిపారు. ఎవరికి వాళ్లు కరోనా నుంచి రక్షణ పొందాల్సిందేనని మోదీ తెలిపారు. కొన్ని దేశాల్లో కరోనా తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తుందని చెప్పారు. ఆ పరిస్థితి భారత్ కు రాకూడదన్నారు. ఎవరికి వారు మాస్క్ లను ఉపయోగిస్తూ, భౌతికదూరం పాటిస్తూ కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. పండగల సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని మోదీ పిలుపునిచ్చారు. దసరా, దీపావళి సందర్భంగా ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.