అసలు వాళ్లు ఎందుకు ఆందోళన చేస్తున్నారు?
రైతులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారో అర్థం కావడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజ్యసభలో ఆయన ప్రసంగించారు. రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. [more]
రైతులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారో అర్థం కావడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజ్యసభలో ఆయన ప్రసంగించారు. రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. [more]
రైతులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారో అర్థం కావడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజ్యసభలో ఆయన ప్రసంగించారు. రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వ్యవసాయ సంస్కరణలు గత ప్రభుత్వాలు హామీ ఇచ్చిన విషయాన్ని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. విపక్షంలోకి రాగానే అవే చట్టాలను కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని మోదీ చెప్పారు. అసలు చట్టంలో రైతులకు ఉన్న అభ్యంతరాలేమిటో చెప్పడం లేదన్నారు. రైతుల సంక్షేమం కోసమే చట్టాలను తెచ్చామని చెప్పారు. కనీస మద్దతు ధర ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని మోదీ చెప్పారు. రైతులు ఇప్పటికైనా చట్టాలను సరిగా అర్థం చేసుకుంటే ఇటువంటి ఆందోళనలు చేయరని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.