హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్
హైదరాబాద్ - విజయవాడ రహదారిపై ప్రయాణించే వారికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది;

హైదరాబాద్ - విజయవాడ రహదారిపై ప్రయాణించే వారికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. టోల్ ఫీజులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గిన టోల్ ఫీజులు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. ఏప్రిల్ అర్థరాత్రి నుంచి తగ్గించిన టోల్ ఫీజులు అమలులోకి వస్తాయని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. హైదరాబాద్ - విజయవాడ మధ్య ప్రయాణించే వారికి నిజంగా ఇది శుభవార్తే. టోల్ ఫీజులను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తమవుతుంది.
మూడు టోల్ గేట్ల వద్ద...
పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాలలో ఈ తగ్గించిన టోల్ ఛార్జీలు వర్తిస్తాయిని అధికారులు పేర్కొన్నారు. కార్లు, జీపులకు ఒకవైపు ప్రయాణించాలంటే పదిహేను రూపాయలు, రెండు వైపులా ప్రయాణానికి ముప్ఫయి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక కమర్షియల్ వాహనాలు ఒక వైపు ప్రయాణానికి ఇరవై ఐదు రూపాయలు, రెండు వైపులా కలిపి నలభై రూపాయలు చెల్లించాలి. బస్సులు, లారీలు, ట్రక్కులకు ఒకవైపు ప్రయాణానికి యాభై రూపాయలు, ఇరు వైపుల ప్రయాణానికి కలిపి 75 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధీనంలోకి...
దీంతో పాటు ఇరవై నాలుగు గంటల్లో తిరుగు ప్రయాణం చేసిన వారికి టోల్ ఫీజులో ఇరవై ఐదు శాతం రాయితీని కూడా కల్పించింది. తగ్గించిన ఛార్జీలు వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకూ అమలులో ఉంటాయని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తన అథీనంలోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 2012లో ప్రారంభయిన ఈ టోల్ గేట్లు ప్రయివేటు సంస్థలు వసూలు చేస్తున్నాయి. వాటి కాలపరిమితి పూర్తి కావడంతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చేతిలోకి రావడంతో మూడు టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫీజులను తగ్గించింది.