బాబు పుంజుకుంటున్నారు… జాతీయ మీడియా సర్వే..!

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పుంజుకుంటోందని జాతీయ మీడియా సంస్థ రిపబ్లిక్ టీవీ తేల్చింది. కాంగ్రెస్ తో పొత్తు టీడీపీ బాగా కలిసివచ్చే అవకాశం ఉందని అంచనా [more]

;

Update: 2018-12-25 10:16 GMT

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పుంజుకుంటోందని జాతీయ మీడియా సంస్థ రిపబ్లిక్ టీవీ తేల్చింది. కాంగ్రెస్ తో పొత్తు టీడీపీ బాగా కలిసివచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. నేషనల్ అప్రూవల్ రేటింగ్ పేరుతో చేసిన సర్వేలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ – టీడీపీ కూటమి 11 సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్లు తేల్చింది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలుచుకుని ఆధిక్యం చూపే అవకాశం ఉందని అంచనా వేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ కి 41.6 శాతం ఓట్లు, కాంగ్రెస్ – టీడీపీ కూటమికి 38.2 శాతం, బీజేపీకి 11 శాతం, ఇతరులకు 9.3 శాతం ఓట్లు దక్కే అవకాశం ఉందని తేల్చింది.

కాంగ్రెస్ తో టీడీపీ కలవడంతో…

అయితే, ఇదే సర్వే నవంబర్ లో వైసీపీకి 20 ఎంపీ సీట్లు, టీడీపీకి 5 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేసింది. అక్టోబరులో నిర్వహించిన సర్వేలో వైసీపికి 21 సీట్లు, టీడీపీకి 4 మాత్రమే వస్తాయని తేల్చింది. కాగా, అప్పుడు జగన్ కి 41.9 శాతం ఓట్లు, టీడీపీకి 31.4 శాతం, కాంగ్రెస్ కి 7.2 శాతం ఓట్లు వస్తాయని చెప్పింది. దీనిని బట్టి జగన్ ఓట్లు జగన్ కే ఉండగా… టీడీపీ – కాంగ్రెస్ ఓట్లు కలవడంతో టీడీపీ బాగా పుంజుకుని జగన్ కి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని రిపబ్లిక్ టీవీ సర్వే స్పష్టం చేస్తోంది.

Tags:    

Similar News