ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

ఒకే కుటుంబంలో విషం తాగి నలుగురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం సృష్టిస్తోంది. కర్నూలు నగరంలోని వడ్డెగేరిలో విషాదం చోటు చేసుకుంది. ఏం కష్టం వచ్చిందో ఏమో [more]

Update: 2021-06-23 06:40 GMT

ఒకే కుటుంబంలో విషం తాగి నలుగురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం సృష్టిస్తోంది. కర్నూలు నగరంలోని వడ్డెగేరిలో విషాదం చోటు చేసుకుంది. ఏం కష్టం వచ్చిందో ఏమో ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. విషం తాగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుల్లో దంపతులు ప్రతాప్‌ (42), హేమలత(36) , కుమారుడు జయంత్‌ (17), కుమార్తె రిషిత (14) ఉన్నారు. ప్రతాప్ టీవీ మెకానిక్​గా పనిచేస్తున్నాడు. జయంత్ డిప్లొమా చేస్తుండగా.. రిషిత ఏడో తరగతి చదువుతోంది. ఉదయం ఎంతసేపటికీ తలుపుతెరవకపోవటంతో.. అనుమానం వచ్చిన బంధువులు తలుపు కొట్టారు. అయినా స్పందించకపోవడంతో.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. తలుపు పగులగొట్టి చూడగా.. నలుగురూ విగతజీవులుగా పడిఉన్నారు. బంధువులు, స్నేహితులు కరోనా కారణంగా మరణించినందుకే.. మనస్తాపానికి గురై.. విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మనస్తాపానికి గురై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సూసైడ్ నోట్​లో వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News