ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 8వ తేదీన పోలింగ్ జరగనుంది. గతంలో ఆగిపోయిన చోటు [more]

;

Update: 2021-04-02 02:07 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 8వ తేదీన పోలింగ్ జరగనుంది. గతంలో ఆగిపోయిన చోటు నుంచే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని నీలం సాహ్ని నిర్ణయించారు. 8వ తేదీన పోలింగ్ ఉంటుంది. పదో తేదీన కౌంటింగ్ నిర్వహిస్తారు. రీపోలింగ్ అవసరమైతే 9వ తేదీన నిర్వహించాలని నీలం సాహ్ని నిర్ణయించారు. ప్రకటనకు, పోలింగ్ తేదీకి మధ్య ఆరు రోజుల సమయం కేటాయించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని నీలం సాహ్ని తెలిపారు.

Tags:    

Similar News