నీలం సాహ్ని ని తొలగించాలంటూ?

నీలం సాహ్ని ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తొలగించాలంటూ దాఖలయిన పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు తీర్పును సరిగా అర్థం చేసుకోకుండా [more]

;

Update: 2021-06-21 06:07 GMT

నీలం సాహ్ని ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తొలగించాలంటూ దాఖలయిన పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు తీర్పును సరిగా అర్థం చేసుకోకుండా నీలం సాహ్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించారని, దీనివల్ల 160 కోట్ల ప్రజాధనం వృధా అయిందని పిటీషనర్ పేర్కొన్నారు. దీనిపై అఫడవిట్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని ఎస్ఈసీ తరుపున న్యాయవాది కోరారు. దీంతో దీనిపై విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

Tags:    

Similar News