టీపీసీసీకి మరో కొత్త వర్కింగ్ ప్రసిడెంట్ ను నియమిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ అజారుద్దిన్ ను టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ గా నియమించారు. ఇప్పటికే టీపీసీసీకి వర్కింగ్ ప్రసిడెంట్లుగా మల్లు భట్టివిక్రమార్క, రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లు ఉన్నారు. ఇటీవల కుసుమకుమార్ అనే నేతను కూడా ఈ పదవిలో నియమించారు. తాజాగా అజారుద్దిన్ తో మొత్తం టీపీసీసీకి ఐదుగురు వర్కింగ్ ప్రసిడెంట్లు అయినట్లు లెక్క. అయితే, మైనారిటీ ఓట్లను తమవైపు తిప్పుకోవడంలో భాగంగా పార్టీలో అజారుద్దిన్ ను పార్టీలో కీలకం చేసేందుకు అజారుద్దిన్ ను నియమించినట్లు కనిపిస్తోంది.