రైతు రుణాలు..తనాఖా లేకుండా రెండు లక్షలు....!!!

రైతులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది...!!

Update: 2024-12-14 11:02 GMT

రైతులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది...!!

ప్రస్తుతం రైతులకు లక్షా అరవై వేల (1,60,000) రూపాయలు వరకు ఎటువంటి తాకట్టు లేకుండా తీసుకునే వెసులుబాటు ఉంది..కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ లోన్ పరిమితిని రెండు లక్షల రూపాయలు వరకు పెంచింది...!!!


వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని తాజాగా స్పష్టంచేసింది..!!

వ్యవసాయ అవసరాలకు, పంట సాగు కోసం ఎలాంటి తాకట్టు లేకుండా అందించే రుణ సదుపాయాన్ని పెంచుతూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం రైతులు ఎలాంటి తనఖా లేకుండా రూ.1.6 లక్షల వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉండగా.. ఇటీవల దాన్ని రూ.2 లక్షలకు పెంచింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని తాజాగా స్పష్టంచేసింది.

పంటల సాగుకు రైతులు పెడుతున్న ఖర్చులను, ద్రవ్యోల్బణం పెరుగుదలను పరిశీలిస్తూ ఆర్‌బీఐ ఈ పరిమితిని పెంచుతూ వస్తోంది.

2004లో కేవలం రూ.10 వేలే ఉంది. క్రమంగా దాన్ని పెంచుతూ వచ్చింది. తాజాగా దీన్ని రూ.2 లక్షలకు పెంచింది.

ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం..

సాధారణంగా భూ యజమానుల నుంచి ఎలాంటి పూచీకత్తు అడగకుండా బ్యాంకులు రుణాలు మంజూరుచేయాలి. అయితే క్షేత్రస్థాయిలో ఇది అమలుకావడం లేదు. దీంతో ప్రైవేటు వ్యాపారుల నుంచి అధిక వడ్డీతో రుణం తీసుకొని అప్పులపాలవుతున్నారు. అలాంటివారికి అండగా ఉండేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ సదుపాయం కల్పిస్తోంది...!!

వ్యవసాయ పెట్టుబడుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రైతులకు రుణ సదుపాయాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని వ్యవసాయ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ చర్య ద్వారా చిన్న, సన్నకారు రైతులైన 86 శాతం మందికి ప్రయోజనం చేకూరనుందని పేర్కొంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను వేగంగా అమలుచేయాలని, కొత్త రుణ నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించాలని బ్యాంకులకు సూచించింది...!!

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now


Tags:    

Similar News