రమేష్ పిటీషన్ పై తీర్పు రిజర్వ్

నిధులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేసిన పిటీషన్ పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇరువర్గాల వాదన [more]

;

Update: 2020-10-23 02:50 GMT

నిధులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేసిన పిటీషన్ పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇరువర్గాల వాదన విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే తాము39 లక్షల నిధులను విడుదల చేసినట్లు ప్రభుత్వ తరుపున న్యాయవాది పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థలకు ప్రభుత్వం సహకరించాల్సి ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది.

Tags:    

Similar News