గవర్నర్ తో నిమ్మగడ్డ.. హైకోర్టుకు… కూడా?

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. స్థానికసంస్థల ఎన్నికలు జరగకుండా ప్రభుత్వం అడ్డుకుంటుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. స్వయం ప్రతిపత్తి [more]

Update: 2020-11-18 07:24 GMT

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. స్థానికసంస్థల ఎన్నికలు జరగకుండా ప్రభుత్వం అడ్డుకుంటుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల కమిషన్ కు ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినా దానిని సాకుగా ప్రభుత్వం చూపుతుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా ఇక్కడ మాత్రం ప్రభుత్వం సహకరించడం లేదని, ఇదే విషయాన్ని హైకోర్టులో అఫడవిట్ ను సమర్పించనున్నట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు.

Tags:    

Similar News