ఈ సిట్టింగ్ కు ఈసారి టిక్కెట్ లేనట్లే.. పక్కా

ఇక్కడ అది సెంటిమెంటో ఏంటో తెలియదు. ప్రజలు ఒకసారి గెలిపించిన వారిని మరొకసారి ఓడిస్తారని అన్ని పార్టీలూ విశ్వసిస్తాయి;

Update: 2023-01-11 08:06 GMT

నిజం.. ఇక్కడ అది సెంటిమెంటో ఏంటో తెలియదు. ప్రజలు ఒకసారి గెలిపించిన వారిని మరొకసారి ఓడిస్తారని అన్ని పార్టీలూ విశ్వసిస్తాయి. తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్ ఇందులో ఏదీ ఇందుకు మినహాయింపు కాదు. అదే మదనపల్లె శాసనసభ నియోజకవర్గం. ఒక్క 1983, 1985 ఎన్నికల్లోనే ఇక్కడ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచారు. ఇక ఆ తర్వాత మరెవరికి ఛాన్స్ రాలేదు. పార్టీలు కూడా ఆ అవకాశం ఇవ్వలేదు.


ఏ పార్టీ నుంచి గెలిచినా..

విచిత్రం ఏంటంటే మదనపల్లె నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఏ పార్టీ నుంచి గెలిచినా తర్వాత ఎన్నికల్లో వారికి టిక్కెట్ ఇవ్వరు. అది సంప్రదాయంగా వస్తుందో? లేక అక్కడ ప్రజల నాడిని తెలుసుకున్న పార్టీల అధిష్టానం అభ్యర్థులను మారుస్తూ వస్తుంది. ఓటమి పాలయినా తర్వాత ఎన్నికల్లో టిక్కెట్ ఇక్కడ ఇవ్వకపోవడం చిత్రంగానే ఉంది. సహజంగా ఒకసారి ఓడిపోతే మరుసటి ఎన్నికల్లో సానుభూతి ఓట్లు వస్తాయని భావిస్తారు. కానీ ఇక్కడ అదేం చెల్లదు. అన్ని పార్టీలూ అభ్యర్థులను మారుస్తాయి. వరసగా పార్టీ అక్కడ గెలవాలంటే సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాల్సిందే.
ఓటమి పాలయినా...?
1994 లో ఆర్ కృష్ణ సాగర్ కు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇచ్చింది. ఆయన గెలిచారు. కానీ 1999లో ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. ఆర్.శోభకు టిక్కెట్ ఇచ్చింది. ఆమె గెలిచింది. మళ్లీ 2004లో టీడీపీ దొమ్మాలపాటి రమేష్ కు టిక్కెట్ ఇచ్చింది. ఆయన కూడా గెలిచారు. కాని 2009లో దొమ్మాలపాటి రమేష్ కు టిక్కెట్ ఇవ్వలేదు. సాగర్ రెడ్డిని బరిలోకి దించింది. ఇక 2014లో దేశాయి తిప్పారెడ్డికి వైసీపీ టిక్కెట్ ఇచ్చింది. ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు.

ఈసారి కూడా...
కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ తిప్పారెడ్డిని పక్కన పెట్టి మహ్మద్ నవాజ్ భాషాకు టిక్కెట్ ఇచ్చింది. ఆయన మొన్నటి ఎన్నికల్లో గెలిచారు. 2004లో గెలిచిన దొమ్మాలపాటి రమేష్ కు టీడీపీ 2019 ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చింది. ఆయన గెలవలేదు. ఈ నియోజకవర్గం తీరును పరిశీలిస్తే నాలుగు దశాబ్దాలుగా ఒకసారి గెలిచిన వారికి టిక్కెట్ ఏ పార్టీ ఇవ్వడం లేదు. అదే సమయంలో ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే మరోసారి గెలిచిన దాఖలాలు కూడా లేవు. దీన్ని బట్టి చూస్తే ఈసారి మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ భాషాకు టిక్కెట్ వచ్చే అవకాశమే లేదన్నది పార్టీ వర్గాల టాక్.


Tags:    

Similar News