బ్రేకింగ్ : పొత్తులపై పవన్ సీరియస్..టీజీకి వార్నింగ్

టీడీపీతో జనసేన కలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. టీజీ వెంకటేష్ [more]

;

Update: 2019-01-23 09:29 GMT

టీడీపీతో జనసేన కలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. టీజీ వెంకటేష్ నోటికేదొస్తే అది మాట్లాడ వద్దని, పిచ్చిపిచ్చిగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. తాను వద్దనుకుంటే వచ్చి రాజ్యసభ సీటును తెచ్చుకున్న టీజీ వెంకటేష్ కు బుద్ధి చెబుతానని పేర్కొన్నారు. ఏదో పెద్ద మనిషి కదా అని గౌరవమిచ్చి మాట్లాడుతున్నానని, తాను నోరు అదుపు తప్పితే ఏమవుతారో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. పారిశ్రామికవేత్తగా టీజీ వెంకటేష్ నదులను, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపైనా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ చనిపోవడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు.

Tags:    

Similar News