మోదీ ప్రసంగంలో 6జీ ప్రస్తావన.. దీని ప్రత్యేకత ఏంటి?

ఢిల్లీలోని ఎర్రకోటలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఆవిష్కరించి జాతినుద్దేశించి..

Update: 2023-08-15 13:33 GMT

ఢిల్లీలోని ఎర్రకోటలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. మోదీ ప్రసంగంలో పలు విషయాలు ప్రస్తావించారు. ప్రపంచంలో మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అభివృద్ధి చెందుతోందని అన్నారు. అలాగే అంతర్జాతీయంగా ఎక్కడ లేని విధంగా భారత్ లో అతి తక్కువ ధరకే మొబైల్ డేటాను అందిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం 4జీ నుంచి 5జీ టెక్నాలజీకి చేరిందని అన్నారు. ప్రస్తుతం దేశంలో 5జీ టెక్నాలజీ అందుబాటులోకి ఉందని, 6జీ టెక్నాలజీని కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు భారత్ కీలక ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. దీని కోసం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

6జీ అంటే ఏమిటి? 5 కంటే స్పీడ్ గా ఉంటుందా?

ఇప్పుడిప్పుడే 5జీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సాంకేతికత దేశంలోని 700 జిల్లాల్లో అందుబాటులోకి వచ్చింది. అతి త్వరలో మారుమూల ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి రానుందని టెలికం కంపెనీలు చెబుతున్నాయి. ఇక 5జీ కంటే వెయ్యి రెట్ల వేతంలో పని చేస్తుందని తెలుస్తోంది. అయితే టెలికం భాగం (DoT) విడుదల చేసిన 6జీ డాక్యుమెంట్‌ ప్రకారం.. 5జీ నెట్‌వర్క్‌ సెకనుకు 10 గిగాబైట్స్‌ వేగంతో పని చేస్తే 6జీ మాత్రం సెకనుకు ఒక టెరాబైట్‌ వేగంతో పనిచేస్తుంది. ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ల పరంగా చూస్తే 5జీ నెట్ వర్క్ ఆపరేటర్లు 24 గిగాహెడ్జ్‌ నుంచి 66 గిగాహెడ్జ్‌ స్పెక్ట్రమ్‌ వేవ్‌లను ఉపయోగిస్తుంటారు. దీనివల్ల డేటా అనేది వేగంగా స్పీడ్ గా ఉంటుంది. 6జీలో స్పెక్ట్రమ్‌ వేవ్‌లు 30 గిగా హెడ్జ్‌ల నుంచి 300 గిగాహెడ్జ్‌లను దాటి టెరాహెడ్జ్‌ల వరకు ఉపయోగించవచ్చు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న 5జీ సెల్ఫీ డ్రైవింగ్ కార్లు, స్మార్ట్ సిటీలు, రిమోట్ హెల్త్‌కేర్‌ వంటి సేవల్లో 5జీ నెట్‌వర్క్‌ కీలకం కానుందట. ఇక 6జీ ద్వారా ఈ సేవలు మరింత టెక్నాలజీతో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నట్లు టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. ఉదాహరణకు 6జీ టెక్నాలజీ ద్వారా HD క్వాలిటీలో ఉన్న 100 సినిమాలను ఒకే నిమిషంలో డౌన్ లోడ్ చేసుకోవచ్చని అంటున్నారు నిపుణులు. ఈ 6జీని ఎంత దూరంలో ఉన్న డివైజ్‌లనైనా ఫోన్‌తో కంట్రోల్ చేయవచ్చు. ఒకేసారి అధిక సంఖ్యలో వేర్వేరు గ్యాడ్జెట్‌లతో అనుసంధానం చేసుకోవచ్చు. ఇప్పటికే శాంసంగ్‌, ఎల్‌జీ, హువావే లాంటి సంస్థలు 6జీపై ప్రయోగాలు కూడా చేస్తున్నాయి. అయితే టెక్ నిపుణులు చెబుతున్నదాని ప్రకారం.. 2028 - 2030 మధ్యలో 6జీ నెట్‌వర్క్‌ ప్రజలందరికి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయంటున్నారు.

Tags:    

Similar News