అయోధ్యలో మోడీ… పూజలు.. భూమిపూజ

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేశారు. తొలుత అయోధ్య చేరుకున్న మోదీ హనుమాన్ గడి సందర్శించి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత [more]

Update: 2020-08-05 07:19 GMT

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేశారు. తొలుత అయోధ్య చేరుకున్న మోదీ హనుమాన్ గడి సందర్శించి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత రామ్ లల్లా ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించారు. అక్కడ పారిజాతం మొక్కను ప్రధాని నరేంద్ర మోదీ నాటారు. ఆ తర్వాత భూమిపూజ జరిగే ప్రాంగణానికి చేరుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ 40 కిలోల బరువు ఉన్న వెండి ఇటుకను అక్కడ ఉంచారు. అయోధ్య రామనామస్మరణలతో మారుమోగిపోయింది. ఎక్కడ విన్నా జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తి పోయింది. ఈ కార్యక్రమంలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్, గవర్నర్ఆనందిబెనె పటేల్ , ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ లు పాల్గొన్నారు.

Tags:    

Similar News