పోలీస్ బాస్ పేరుతోనే సైబర్ నేరగాళ్లు..?

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో ప్రజలను దోచుకుంటున్నారు. ప్రజలను దోచుకుంటున్న సైబర్ నేరాలను ఎప్పటికప్పుడు పోలీసులు పట్టుకుంటూ ఉన్నప్పటికీ కొత్త రకం గా వీళ్ళు [more]

Update: 2021-07-31 03:50 GMT

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో ప్రజలను దోచుకుంటున్నారు. ప్రజలను దోచుకుంటున్న సైబర్ నేరాలను ఎప్పటికప్పుడు పోలీసులు పట్టుకుంటూ ఉన్నప్పటికీ కొత్త రకం గా వీళ్ళు దోపిడీకి పాల్పడుతున్నారు. ఏకంగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి గా పనిచేసిన న్యాయమూర్తులు సైతం సైబర్ నేరగాళ్లు వదిలిపెట్టలేదు. బ్యాంక్ అకౌంట్ డెబిట్ కార్డు ఫ్రీజ్ అవుతుందని చెప్పి న్యాయమూర్తిని ఏకంగా దోచుకున్నారు. న్యాయమూర్తి అకౌంట్ నుంచి 50 వేల రూపాయలు కొట్టేశారు. ఈమేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో న్యాయమూర్తి ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన నుంచి పోలీసు అధికారులు తేరుకోకముందే తెలంగాణ పోలీస్ బాస్ మహేందర్రెడ్డి పేరుమీద మోసాలకు పాల్పడుతున్న ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది . డీజీపీ మహేందర్రెడ్డి ఫోటోను వాట్సాప్ లో డిపి గా పెట్టుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మేరకు కొంత మంది సైబర్ నేరగాళ్లు మహేందర్రెడ్డి ఫోటోలను మిస్ యూజ్ చేస్తున్నట్లుగా ఒకరు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

Tags:    

Similar News