ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు పీడీ యాక్ట్ పెట్టారు. ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు పీడీ యాక్ట్ పెట్టారు. మంగళహాట్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఈ పీడీ యాక్ట్ ను నమోదు చేశారు. ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక ఎమ్మెల్యే పై తొలిసారిగా పీడీ యాక్ట్ నమోదయింది. దేశ వ్యాప్తంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే రాజాసింగ్ పై అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. రాజాసింగ్ పై 101 కేసులున్నాయి. అందులో 18 కేసుల మతపరమైన విధ్వేషాలు రేపుతూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించినవే.
గతంలోనే రౌడీ షీట్...
ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్ల నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. చాలా సార్లు ఆయన ఒక వర్గాన్ని కించ పర్చేలా వ్యాఖ్యానించారననారు. అందుకే ఆయనపై పీడీ యాక్ట్ పెట్టామని చెప్పారు. గతంలోనూ రాజాసింగ్ పై రౌడీషీట్ ఉందని చెప్పారు. ఓ యూట్యూబ్ ఛానల్ లో రాజాసింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని సీపీ ఆనంద్ చెప్పారు. మహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.