ఇంటర్నెట్ లో చూసి.. 9 మందిని హత్య చేసి?

వరంగల్ జిల్లాలో గొర్రెకుంట లో ఒక బావిలో 9 మృతదేహాలు లభ్యమైన కేసును పోలీసులు ఛేదించారు. ఈ తొమ్మిది మంది హత్య కు గురైనారని పోలీస్ ఇన్వెస్టిగేషన్లో [more]

Update: 2020-05-25 02:37 GMT

వరంగల్ జిల్లాలో గొర్రెకుంట లో ఒక బావిలో 9 మృతదేహాలు లభ్యమైన కేసును పోలీసులు ఛేదించారు. ఈ తొమ్మిది మంది హత్య కు గురైనారని పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది. సంజయ్ అదుపులోకి తీసుకొని విచారించగా మొత్తం విషయం బయటకు వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…..మక్సూద్‌ అల్లుడు కొంతకాలం క్రితం భార్యను వదిలేశాడు. అప్పటినుండి మక్సూద్ కుటుంబంపై కక్ష తీర్చుకోవాలని అవకాశం కోసం ఎదురు చూశాడు. అల్లుడు ఖతూన్‌ డైరెక్షన్‌లో ఈ హత్యలన్నీ జరిగాయి.ఢిల్లీలో ఉన్న ఖతూన్ , హైదరాబాద్ లో ఉంటున్న సంజయ్ తో ప్లాన్ చేశాడు. సంజయ్ కి మక్సూద్ మరదలు తో అక్రమ సంబంధం ఉంది. ఈ కారణంతోనే సంజయ్ మక్సూద్ ఇంటికి తరుచు వస్తూ ఉంటాడు. సంజయ్ విషయం తెలుసుకున్న మక్సూద్ అల్లుడు ఈ తొమ్మిది హత్యలు చేయడానికి సంజయ్ తో డీల్ కుదుర్చుకున్నాడు.

పథకం ప్రకారం…..

ఒక పథకం ప్రకారం సంజయ్ మక్సూద్‌ భార్య, కూతురితో వాట్సాప్‌లో చాటింగ్‌ చేశాడు. వారితో పరిచయం పెంచుకున్నాడు. ముందుగానే ఒక పథకం ప్రకారం మూడు మెడికల్ షాప్ లో నుంచి నిద్ర మాత్రలు కొన్నాడు. ఆ రోజు జరిగిన బర్త్‌డే పార్టీకి పిలవ కుండానే సంజయ్ వెళ్లాడు. బర్త్ డే పార్టీలో కూల్ డ్రింక్ లో నిద్ర మాత్రలు కలిపి 8మందికి ఇచ్చి తాగించాడు. ఇద్దరు వ్యక్తులతో కలిసి గోనే సంచులు వారిని కట్టి బావిలో పడ్డ వేసాడు. సంజయ్ కి ఈ హత్య చేయడానికి ఇద్దరు బీహారీ వ్యక్తులు సహాయం చేశారు. అయితే సంజయ్ హత్యకేసు బయటపడితే తన పేరు వస్తుందని, తాను అరెస్ట్ అవుతానన్న భయంతో ఇద్దరు బీహార్ వ్యక్తులను కూడా వదిలిపెట్టకుండా వారిని కూడా హత్య చేసి బావిలో పడేశాడు. సంజయ్ ఈ ఇద్దరు బీహార్ వ్యక్తులను హత్య చేయడానికి ఆటో డ్రైవర్ సహాయం తీసుకున్నాడు. సంజయ్ 9 హత్యలు చేయడానికి ముందుగానే ఒక పథకం ప్రకారం ఇంటర్నెట్‌లో చూసి సెర్చ్‌ చేసి ఈ హత్యలకు పాల్పడ్డానని సంజయ్ పోలీసుల విచారణలో తెలిపాడు. ఈ హత్యలు అన్నీ చేయడానికి సంజయ్ తో పాటు మక్సూద్ మరదలు కూడా ఇందుకు కారణం కావడంతో పోలీసులు సంజయ్ తో పాటు మక్సూద్ మరదలిని కూడా అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Tags:    

Similar News