బ్రేకింగ్ : బీహార్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే

బీహార్ లో పోలింగ్ ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడవుతున్నాయి. పీపుల్స్ పల్స్ సంస్థ తన ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలను వెల్లడించింది. బీహార్ లో [more]

Update: 2020-11-07 12:57 GMT

బీహార్ లో పోలింగ్ ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడవుతున్నాయి. పీపుల్స్ పల్స్ సంస్థ తన ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలను వెల్లడించింది. బీహార్ లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో ఎన్డీఏ కూటమికి కి 90 నుంచి వంద స్థానాలు సాధించే అవకాశాలున్నాయిని పేర్కొంది. అలాగే మహాగడ్బంధన్ కు వంద నుంచి 115 స్థానాలు దక్కుతాయని అంచనా వేసింది. లోక్ జనశక్తి పార్టీకి మూడు నుంచి ఐదు స్థానాలు వస్తాయని పేర్కొంది. ఇతరులు 8 నుంచి 18 స్థానాల్లో విజయం సాధిస్తాయని పేర్కొంది. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కవగా ఉంటే మహాగడ్బందన్ కే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని పీపుల్స్ పల్స్ ఫలితాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రిగా 36 శాతం మంది తేజస్వి యాదవ్ వైపు మొగ్గు చూపితే, 34 శాతం మంది నితీష్ కుమార్ వైపు ఉన్నారని తేలింది.

Tags:    

Similar News