ఎన్నికలు ప్రశాంతమే.. ఫలితాలు మాత్రం?

ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 515 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 20,840 మంది [more]

;

Update: 2021-04-09 01:07 GMT

ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 515 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 20,840 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ఓటింగ్ లో పాల్గొనేందుకు ప్రజలు పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, కరోనా వైరస్ తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు పోలింగ్ కు దూరంగా ఉన్నారని అంటున్నారు. రాష్ట్రం మొత్తం మీద 50 శాతం లోపే పోలింగ్ జరగడం విశేషం. అయితే ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 10వ తేదీన రావాల్సి ఉండగా, కోర్టు తీర్పుతో వాయిదా పడింది. ఈనెల 15వ తేదీన న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై ఫలితాలు ఎప్పుడు తెలుస్తాయన్నది ఆధారపడి ఉంది.

Tags:    

Similar News