కొత్త పార్టీలు ఏమీ చేయలేవు

వైఎస్ షర్మిల కొత్త పార్టీపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. తెలంగాణలో రాజులు, రాజ్యాలు పోయాయన్నారు. రాజన్న రాజ్యం అనేది ఏమీ ఉండదని పువ్వాడ [more]

;

Update: 2021-03-20 00:50 GMT

వైఎస్ షర్మిల కొత్త పార్టీపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. తెలంగాణలో రాజులు, రాజ్యాలు పోయాయన్నారు. రాజన్న రాజ్యం అనేది ఏమీ ఉండదని పువ్వాడ అజయ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఇక రాజ్యాల ప్రస్తావన ఎక్కడిదని పువ్వాడ అజయ్ ప్రశ్నించారు. తెలంగాణలో కొత్త పార్టీలకు అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ అన్ని రకాలుగా రాష్ట్రం అభివృద్ధి చేసిందని, ఇక కొత్త పార్టీ వచ్చి ఇక్కడ ఏం చేస్తుందన్నారు పువ్వాడ అజయ్ కుమార్.

Tags:    

Similar News