కాంగ్రెస్ లో అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు ప్రత్యేకంగా పార్టీ అధిష్టానం బుజ్జగింపుల కమిటీని నియమించింది. రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఈ కమిటీని నియమించడం విశేషం. తెలంగాణలో అనేక మంది ఆశావహులు టిక్కెట్లు దక్కకపోవడంతో కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతుండగా, మరికొందరు ఇతర పార్టీల నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. టిక్కెట్లు రాని వాళ్లంతా కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగాలని వ్యూహరచన చేస్తున్నారు.
కర్ణాటక మంత్రి డీకే.....
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ బుజ్జగింపుల కమిటీని నియమించారు. ఈకమిటీలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి తో పాటు, పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు, కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ లు ఉన్నారు. ముఖ్యంగా డీకే శివకుమార్ కు ట్రబుల్ షూటర్ గా పేరుంది. ఈ నేపథ్యంలో ఈ కమిటీ రేపు దాదాపు 70 మంది కాంగ్రెస్ నేతలను కలసి బుజ్జగించనుంది. మరోవైపు మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డితో సీనియర్ నేత జానారెడ్డి భేటీ అయ్యారు. పార్టీ అండగా ఉంటుందని, పార్టీని వీడే ప్రయత్నం చేయవద్దని ఆయన కోరినట్లు తెలుస్తోంది.