‘‘ఈ చారిత్రాత్మిక సభకు సోనియాగాంధీ వచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వచ్చి ఈ రాష్ట్రంపై ఆమె ఆంకాక్షలను వెలిబుచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేస్తున్నప్పుడు సోనియాగాంధీ మీ వెంటే నిలుచున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే అందరూ రక్తమోడిస్తేనే రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజా పోరాటాలతో పాటు సోనియాగాంధీ పాత్ర కూడా ఉంది. అది అనిర్వచనీయమైంది. తెలంగాణ రాష్ట్ర సమితి నాలుగున్నర సంవత్సరాల కాలం రాక్షస పాలనకు చరమగీతం పాడబోతున్నాం. ఈ రాక్షస రాజ్యాన్ని నిర్మూలించేందుకు కాంగ్రెస్ తో కలసి టీజేఎస్, టీడీపీ, సీపీఐ కలిసి కట్టుగా ఎన్నికల బరిలోకి దిగాం. ప్రజాకూటమితోనే అన్ని వర్గాలకూ న్యాయం జరుగుతుంది. కూటమిలో ప్రజల ఆకాంక్షలు, రైతుల ఆశయాలు, విద్యార్థుల భవిష్యత్తు అన్నీ ఉన్నాయి. లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించడమే కూటమి లక్ష్యం’’ అని రాహుల్ గాంధీ మేడ్చల్ లో జరిగిన సభలో ప్రసంగించారు.