నవ్వులపాలయిన పెద్దాయన
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ శాసనసభలో నవ్వుల పాలయ్యారు. గత ఏడాదికి చెందిన బడ్జెట్ ను ఈ ఏడాది ప్రవేశపెట్టారు
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ శాసనసభలో నవ్వుల పాలయ్యారు. గత ఏడాదికి చెందిన బడ్జెట్ ను ఈ ఏడాది ప్రవేశపెట్టారు. దాదాపు ఏడు నిమిషాల పాటు పాత బడ్జెట్ నే పెద్దాయన చదివారు. దీంతో భారతీయ జనతా పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో అశోక్ గెహ్లాత్ సభకు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ నే తిరిగి అశోక్ గెహ్లాత్ చదువుతుండటంతో బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో అప్పుడు గెహ్లాత్ కు అర్థమయింది. మంత్రి మహేష్ జోషి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వెనువెంటనే నాలుక్కరచుకుని తాజా బడ్జెట్ ను చదవడం ప్రారంభించారు.
గత ఎన్నికల బడ్జెట్...
తాను గత ఎన్నికల బడ్జెట్ ను ఇప్పుడు ప్రవేశపెడుతున్నానని గ్రహించి తప్పును సరిదిద్దుకున్నారు. సభకు క్షమాపణలు చెప్పారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే ఇందుకు బాధ్యులైన అధికారులపై రాజస్థాన్ ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంతసేపటికీ బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనలు విరమించకపోవడంతో సభను స్పీకర్ కొద్దిసేపు వాయిదా వేశారు.