రకుల్ ఇరుక్కున్నది అక్కడేనా?
డ్రగ్స్ కేసులో సినీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. మనీలాండరింగ్ కేసులో రకుల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి పదిన్నర [more]
;
డ్రగ్స్ కేసులో సినీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. మనీలాండరింగ్ కేసులో రకుల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి పదిన్నర [more]
డ్రగ్స్ కేసులో సినీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. మనీలాండరింగ్ కేసులో రకుల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి పదిన్నర గంటల కు రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉండగా, 9 గంటలకే ఆమె హాజరయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ బ్యాంక్ అకౌంట్ లో రకుల్ ప్రీత్ సింగ్ డబ్బులు జమ చేశారని ఈడీ అధికారులు అనుమానిస్తుననారు. ఇప్పటికే ఈడీ ఈ కేసులో పూరీ జగన్నాధ్, చార్మిలను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. గతంలో ఎక్సైజ్ పోలీసులు విచారించిన జాబితాలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు లేదు. అయితే ఎఫ్ క్లబ్ లో మరో హీరోతో కలసి ఆమె డ్రగ్స్ సేవించారని, డ్రగ్స్ సప్లయర్ కు రకుల్ ఖాతా నుంచే సొమ్ములు వెళ్లాయన్నది ఈడీ అధికారుల అనుమానం. ఎఫ్ క్లబ్ కు హాజరవ్వడమే రకుల్ కు కష్టాలు తెచ్చి పెట్టింది.