భయపడి వైసీపీలో చేరలేదు… భక్తితోనే చేరా
తాను భయపడి వైసీపీలో చేరలేదని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తెలిపారు. తాను జైల్లో ఉన్నప్పుడు కూడా కార్యకర్తలు పార్టీ కోసం పనిచేశారని ఆయన గుర్తు చేశారు. కేవలం [more]
;
తాను భయపడి వైసీపీలో చేరలేదని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తెలిపారు. తాను జైల్లో ఉన్నప్పుడు కూడా కార్యకర్తలు పార్టీ కోసం పనిచేశారని ఆయన గుర్తు చేశారు. కేవలం [more]
తాను భయపడి వైసీపీలో చేరలేదని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తెలిపారు. తాను జైల్లో ఉన్నప్పుడు కూడా కార్యకర్తలు పార్టీ కోసం పనిచేశారని ఆయన గుర్తు చేశారు. కేవలం ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు ఆకర్షితుడనై వైసీపీలో చేరారన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో కడప స్టీల్ ఫ్యాకర్టీ నిర్మాణం చేపట్టడాన్ని తాను స్వాగతించానన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను జగన్ ప్రవేశపెట్టారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలను నెరవేరుస్తున్నారన్నారు. మనస్ఫూర్తిగా, స్వచ్ఛందంగానే తాను వైసీపీలో చేరానని చెప్పారు. నలభై ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎవరికీ భయపలేదన్నారు. జగన్ నాయకత్వం కింద పనిచేయాలని ఈ పార్టీలోకి వచ్చామన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై నమ్మకం లేదన్నారు. జమ్మలమడుగులో జగన్ నాయకత్వాన్ని చూసే సుధీర్ రెడ్డిని 58 వేల ఓట్లతో జనం గెలిపించారన్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలసి పనిచేస్తామన్నారు.