రాపాక మళ్లీ..మళ్లీ
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి జగన్ నిర్ణయాన్ని సమర్థించారు. మూడు రాజధానుల నిర్ణయం సరైనదేనని రాపాక వరప్రసాద్ చెప్పారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి అవుతాయంటే ఎవరు [more]
;
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి జగన్ నిర్ణయాన్ని సమర్థించారు. మూడు రాజధానుల నిర్ణయం సరైనదేనని రాపాక వరప్రసాద్ చెప్పారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి అవుతాయంటే ఎవరు [more]
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి జగన్ నిర్ణయాన్ని సమర్థించారు. మూడు రాజధానుల నిర్ణయం సరైనదేనని రాపాక వరప్రసాద్ చెప్పారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి అవుతాయంటే ఎవరు మాత్రం కాదంటారని రాపాక వరప్రసాద్ ఎదురు ప్రశ్నించారు. హైదరాబాద్ నే అభివృద్ధి చేయడం వల్ల గతంలో ఆంధ్రప్రదేశ్ ఎంతో నష్టపోయిన విషయాన్ని రాపాక వరప్రసాద్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. జగన్ మంచి చేస్తే అభినందిస్తానని, చెడు చేస్తే వ్యతిరేకిస్తానని తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వం రైతుల నుంచి అమరావతిలో భూములను బలవంతంగా లాక్కుందని ఆరోపించారు. అయితే మూడు రాజధానులను ఏర్పాటు చేసినా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రాపాక వరప్రసాద్ అభిప్రాయపడ్డారు.