బ్రేకింగ్ ; రాయలసీమ ఎత్తిపోతల పథకంపై హైకోర్టులో
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కాంగ్రెస్ నేత వంశీచందర్ రెడ్డి పిటీషన్ పై విచారణ జరిగింది. అయితే రెండు రాష్ట్రాలకు సంబంధించిన జలవివాదం [more]
;
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కాంగ్రెస్ నేత వంశీచందర్ రెడ్డి పిటీషన్ పై విచారణ జరిగింది. అయితే రెండు రాష్ట్రాలకు సంబంధించిన జలవివాదం [more]
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కాంగ్రెస్ నేత వంశీచందర్ రెడ్డి పిటీషన్ పై విచారణ జరిగింది. అయితే రెండు రాష్ట్రాలకు సంబంధించిన జలవివాదం కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్లాలని హైకోర్టు సూచించింది. అయితే ఇది అంతర్ రాష్ట్ర వివాదంగా చూడకుండా రాష్ట్ర పునర్విభజన చట్టం పరిధిలో చూడాలని పిటీషనర్ల తరుపున న్యాయవాది కోరారు.రెండు రాష్ట్రాల జలవివాదం హైకోర్టు పరిధిలోకి ఎలా వస్తుందని సీజే ప్రశ్నించారు. దీనిపై తమ పిటీషనర్లతో చర్చించి చెబుతామని న్యాయవాది చెప్పడంతో విచారణను రేపటికి వాయిదా వేశారు.