Revanth reddy : కేసీఆర్ అప్పుడే ఆ పనిచేసి ఉంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండి పడ్డారు. దళితులకు మూడు ఎకరాలు అప్పుడే ఇచ్చి ఉంటే వారు ధనవంతులయ్యేవారన్నారు. గిరిజనులకు రిజర్వేషన్లు [more]

;

Update: 2021-09-13 12:55 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండి పడ్డారు. దళితులకు మూడు ఎకరాలు అప్పుడే ఇచ్చి ఉంటే వారు ధనవంతులయ్యేవారన్నారు. గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించి ఉంటే వారు ప్రభుత్వోద్యోగులుగా మారేవారని రేవంత్ రెడ్డి అన్నారు. కరోనా వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చి ఉంటే అనేక మంది ప్రాణాలు కోల్పోయేవారు కాదని రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ ఎన్నికల కోసమే పథకాలను తీసుకువస్తారని ఎద్దేవా చేశారు. గజ్వేల్ సభ అంతం కాదని, ఆరంభం మాత్రమేనని అన్నారు. గజ్వేల్ సభకు ఇన్ ఛార్జిగా గీతారెడ్డి వ్యవహరిస్తారని రేవంత్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News