Revanth reddy : కేసీఆర్ మోసాన్ని అందరూ గుర్తించాలి

తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనకు స్వస్తి పలకాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో స్వేచ్చ, సామాజిక న్యాయం లేదని అన్నారు. పదవులన్నీ కుటుంబ సభ్యులకే [more]

;

Update: 2021-09-17 15:11 GMT

తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనకు స్వస్తి పలకాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో స్వేచ్చ, సామాజిక న్యాయం లేదని అన్నారు. పదవులన్నీ కుటుంబ సభ్యులకే ఇచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశారన్నారు. దళితులను ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ అధికారంలోకి రాగానే మాటమార్చారని తెలిపారు. కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలని కోరారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గజ్వేల్ లోనే అభివృద్ధి లేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో జరిగిన దళిత ఆత్మగౌరవ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

Tags:    

Similar News