Revanth reddy : వాళ్లిద్దరినీ తరిమికొట్టండి… రేవంత్ పిలుపు
కేసీఆర్, ఈటల ఆధిపత్య పోరుతోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ పరువును బీజేపీ, టీఆర్ఎస్ దిగజారుస్తున్నాయన్నారు. ఉద్యమాల గడ్డను [more]
;
కేసీఆర్, ఈటల ఆధిపత్య పోరుతోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ పరువును బీజేపీ, టీఆర్ఎస్ దిగజారుస్తున్నాయన్నారు. ఉద్యమాల గడ్డను [more]
కేసీఆర్, ఈటల ఆధిపత్య పోరుతోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ పరువును బీజేపీ, టీఆర్ఎస్ దిగజారుస్తున్నాయన్నారు. ఉద్యమాల గడ్డను తాగుబోతుల అడ్డాగా మార్చారని రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రజలు ఆశీర్వదించాలన్నారు. రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. అప్పుడే కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ప్రజల ఇబ్బందులపై దృష్టి పెడతాయని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇద్దరి నియంతలను తరిమి కొట్టాలంటే హుజూరాబాద్ లో కాంగ్రెస్ ను గెలిపించాలని ఆయన కోరారు.