'విప్లవం' వర్ధిల్లాలి ! గాజువాకలో పవన్ గర్జన !!

''ఇంకా ఆరు నెలలే.జగన్ పనయిపోతుంది.అప్పటివరకు భరించాలి.ప్రజల సమస్యల విషయంలో నేను చాలా మొండివాడ్ని..

Update: 2023-08-13 16:00 GMT

''ఇంకా ఆరు నెలలే.జగన్ పనయిపోతుంది.అప్పటివరకు భరించాలి.ప్రజల సమస్యల విషయంలో నేను చాలా మొండివాడ్ని.ప్రశ్నించడానికే మంగళగిరికి మకాం మార్చాను.పోలవరం జగన్ కు ఏటీఎంలా మారింది.నాకుం ఒక్క ఎంపీ కూడా లేరు.బీజేపీతో గొడవ పెట్టుకోను. జగన్ గెలిచి నేను ఎట్లా ఓడిపోయాను.దోపిడీ చేసే జగన్ కు 151 సీట్లు ఎలా వచ్చాయి.విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందో చూపుతా.వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ప్రధానితో విబేధించాను.2024 లో గాజువాకలో జనసేన జెండా ఎగురుతుంది.ఒక క్రిమినల్ కు,అసమర్థునికి అధికారం ఎలా ఇచ్చారు?కొండా మీద ఉండాల్సింది దేవుడు.క్రిమినల్ కాదు''............ అంటూ గాజువాకలో ఆదివారం రాత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగం సాగింది.''ఈ సారి ఆలోచించి ఓటు వేయండి.డబ్బు తీసుకొని ఓటు వేస్తే నేనేమీ చేయలేను'' అని కూడా పవన్ చేతులెత్తేశారు.




 

పవన్ 2019 లో చేసిన తప్పునే మళ్ళీ చేస్తున్నారు.అవినీతి,అక్రమాలు,ఆర్ధిక నేరగాడు,క్రిమినల్... అంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్ పై పెద్దఎత్తున విరుచుకుపడ్డారు.'క్రిమినల్ కు అధికారం ఎలా ఇస్తారు' అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అదే రూటులో ప్రచారం సాగించారు.కానీ సామాన్య ఓటర్లను ఆ ప్రచారం ప్రభావితం చేయలేదు.'ఒక్కక్క చాన్సు ఇవ్వండి' అనే జగన్ నినాదం ప్రజల్ని బలంగా తాకింది.ప్రజల్ని ఆ నినాదం,ఆయన సింప్లిసిటీ,పాదయాత్ర,జగన్ తండ్రి వైఎస్ ఆర్ చేసిన సేవలు... అన్నీ ఆకట్టుకున్నవి.ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఏపీలో మొదటిసారి చంద్రబాబుకు ప్రజలు అధికారం ఇచ్చారు.అయిదేళ్లలోనే మార్పు కోరుకున్నందున జగన్ కు అధికారం కట్టబెట్టారు.

గడచిన నాలుగున్నర ఏళ్లుగా జగన్ ప్రభుత్వం వైఫల్యాలు ఏమిటో ఏకరువు పెట్టి,తాము అధికారంలోకి వస్తే ఏమి చేయగలమో,ఎంత అద్భుతమైన పాలన అందిస్తామో,అన్ని వర్గాల ప్రజల్ని ఎట్లా సంతృప్తి పరచగలరో చంద్రబాబు,పవన్,పురంధేశ్వరి చెప్పగలిగితే ప్రయోజనం ఏమైనా ఉంటుందేమో ఆయా పార్టీలు,వైసీపీ వ్యతిరేక రాజకీయ శక్తులు ఆత్మవిమర్శ చేసుకోవలసి ఉన్నది.'క్రిమినల్' అన్నంత మాత్రాన జగన్ క్రిమినల్ అయిపోరు.జగన్ పై కేసులున్న మాట నిజమే.16 నెలలు జైలులో గడిపిన మాట నిజమే.కానీ జగన్ ఎంతో కష్టపడ్డారు.ప్రజల్లోకి వెళ్లి ఆశీస్సులు కోరారు.ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారు.జగన్ ఈ రోజు వరకు కొన్ని కేసులలో 'నిందితుని'గా ఉన్నారు.జగన్ నేరస్థుడా కాదా అన్నది కోర్టు తేల్చాలి.చంద్రబాబు,పవన్ కాదు.

ప్రజలకు కావలసింది ఏమిటి?ప్రజలు ఏమి కోరుకుంటున్నారు?ఏ వర్గాలు జగన్ ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారు?అందుకు గల కారణాలు ఏమిటి? వంటి పలు ప్రశ్నలకు జవాబు వెతికి వాటిని ప్రజలకు వివరించి కన్విన్సు చేయాలి.తమ వైపునకు మళ్లించాలి.కేవలం జగన్ జపం చేస్తూ జగన్ పై టన్నుల కొద్ది ఆరోపణలు కుమ్మ్మరించినంత మాత్రాన ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా తయారు కారన్న లాజిక్కును చంద్రబాబు,పవన్ మిస్సవుతున్నారు.

విప్లవకారుడు,రాజకీయ నాయకుడు.... ఈ మాటలు ఏమిటి? ఎవరు విప్లవకారుడు?ఎవరు రాజకీయ నాయకుడు?పవన్ కళ్యాణ్ మాజీ నక్సలైటు కాదు.ఆయనకు మార్క్సిజం,లెనినిజం,మావోయిజం గురించి తెలుసని నేను అనుకోవడం లేదు.మార్క్సిస్టు - లెనినిస్టు గ్రూపులేవీ పవన్ సొంతం చేసుకోవు.ఆయనలు ఎం.ఎల్.గ్రూపులతో సంబంధాలూ లేవు.మరి 'విప్లవకారుడు రాజకీయ నాయకునిగా మారితే ఎట్లా ఉంటుందో చూస్తారు'! అని ప్పవం ఎందుకు అంటున్నట్టు? చేగువేరా గురించి కొంత చదివినంత మాత్రాన,దివంగత గద్దర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నత మాత్రాన,'జల్సా' సినిమాలో నక్సలైటు పాత్ర పోషించినంత మాత్రమే తాను విప్లవకారుడ్ని అని ఆయా ఆయన అనుకుంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు.

కనుక పవన్ ఇప్పటికయినా జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే తాము అధికారంలోకి వచ్చాక ఎలాంటి సంస్కరణలు తీసుకు రాదలచారో వివరించడం బెటర్.


 (Views, thoughts, and opinions expressed in this న్యూస్ story/article belong solely to the author)

Tags:    

Similar News