హైదరాబాద్ లో రెచ్చిపోతున్న దోపిడీ దొంగలు

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఒక సాప్ట్ వేర్ ఇంజినీర్ ఇంట్లోకి చొరబడి కట్టేసి ఇంట్లో ఉన్న డబ్బులు, ఏటీఎం కార్డులను ఎత్తుకొని పారిపోయారు. [more]

Update: 2021-07-31 03:53 GMT

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఒక సాప్ట్ వేర్ ఇంజినీర్ ఇంట్లోకి చొరబడి కట్టేసి ఇంట్లో ఉన్న డబ్బులు, ఏటీఎం కార్డులను ఎత్తుకొని పారిపోయారు. నీళ్లు కావాలంటూ ఇంట్లోకి వచ్చి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బంధించి దోపిడీకి పాల్పడ్డారు. ఈ సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సాప్ట్ వేర్ ఇంజనీర్ హర్ష , సాయి రామ్ కలిసి ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. సాయంత్రం 7 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు . ఈ గుర్తు తెలియని వ్యక్తులు తమకు మంచినీళ్లు కావాలంటూ ఇంట్లో ఉన్న హర్ష ను అడిగారు. ఇంటి లోపలికి వెళ్లి మంచినీళ్లు తెచ్చేందుకు వంటగదిలోకి వెళ్లారు. ఈ సమయంలోనే ఇద్దరు వ్యక్తులు ఇంటిలోకి బలవంతంగా ప్రవేశించారు. ఇంటి లోపలికి వచ్చిన దుండగులు ఇద్దరూ హర్ష చేతులు కాళ్లు కట్టేశారు. అంతేకాకుండా అరవకుండా ఉండేందుకు నోట్లో గుడ్డలు పెట్టారు. హర్ష ను తాళ్లతో బంధించి ఇంట్లో ఉన్న నగలు నగదు ఏటీఎం కార్డ్స్ ఎత్తుకొని పారిపోయారు. కొన్ని గంటల తర్వాత సాయి రామ్ ఇంటికి చేరుకున్నా డు.. సాయి రామ్ కి జరిగిన సంఘటన వివరించాడు. ఈ సంఘటనపై హర్ష చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు . ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

Tags:    

Similar News