బ్రేకింగ్ : ఎన్నికల కమిషనర్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ

జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. స్వస్తిక్ ముద్ర ఉన్న వాటినే పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. బ్యాలట్ పేపర్ [more]

;

Update: 2020-12-04 04:49 GMT

జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. స్వస్తిక్ ముద్ర ఉన్న వాటినే పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. బ్యాలట్ పేపర్ లో పెన్నుతో టిక్ మార్కు ఉన్నా వాలిడ్ అవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఎస్ఈసీ ఉత్తర్వులపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News