బూందీ మాటున 13 కోట్ల రూపాయలను?

తినుబండారాల ముసుగులో విదేశీ కరెన్సీ తరలిస్తున్న వ్యక్తి గుట్టును రట్టు చేశారు శంషాబాద్ సిఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు. బూంది చాటున‌ 13 కోట్ల రూపాయలకు పైగా విదేశీ [more]

;

Update: 2021-03-25 00:54 GMT

తినుబండారాల ముసుగులో విదేశీ కరెన్సీ తరలిస్తున్న వ్యక్తి గుట్టును రట్టు చేశారు శంషాబాద్ సిఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు. బూంది చాటున‌ 13 కోట్ల రూపాయలకు పైగా విదేశీ కరెన్సీ ని దుబాయ్ కు తరలిస్తూ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సిఐఎస్ఎఫ్ అధికారులకు అడ్డంగా దొరకిపోయాడు. వివరాల లోకి వెళితే హైదరాబాద్ పాత బస్తీ కి చెందిన మహ్మద్ అనే ప్రయాణీకుడు దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాడు. ఎయిర్ పోర్ట్ లో అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా లగేజ్ బ్యాగ్ లో కోటి రూపాయల విదేశీ కరెన్సీ ని దాచి పెట్టాడు. తినే బూంది లో విదేశీ కరెన్సీని ప్యాకింగ్ చేసి లగేజ్ బ్యాగ్ లో అమర్చాడు. ఎయిర్ పోర్ట్ లో సిఐఎస్ఎఫ్ చెక్ ఇన్ వద్దకు చేరుకున్నాడు. అయితే ప్రయాణీకుడి వ్యవహారశైలి లో అనుమానం వచ్చిన ఇంటెలిజెన్స్ అధికారులు తమదైన పద్దతిలో విచారణ చేసారు. దీంతో అక్రమంగా దుబాయ్ కు తరలిస్తున్న విదేశీ కరెన్సీ గుట్టును కనిపెట్టారు. తినే రుచికరమైన బూంది లో 13 కోట్ల రూపాయలకు పైగా విదేశీ కరెన్సీ దాచిపెట్టాడు. ఓ కాటన్ బాక్స్ లో కింది భాగంలో కరెన్సీ నోట్లు పేర్చి పై నుండి బూంది ని నింపాడు కేటుగాడు. ఆ కాటన్ బాక్స్ ను తన లగేజ్ బ్యాగ్ లో పెట్టుకొని తరలించే ప్రయత్నం చేసాడు. కానీ ఎయిర్ పోర్ట్ లో ఆ కేటుగాడి తెలివికి తూట్లు వేసారు సిఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారుల బృందం. ఆవలి ఇస్తే పేలు లెక్కబెట్టే భద్రతా సిబ్బంది మహ్మద్ ను పట్టుకున్నారు. విదేశీ కరెన్సీ ని స్వాధీనం చేసుకొని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఇంత పెద్ద మొత్తంలో కరెన్సీ ఎక్కడ నుండి వచ్చింది అనే కోణంలో విచారణ చేపట్టారు.

Tags:    

Similar News